SKLM: పాత పింఛన్ విధానం కోరుతూ డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని సోమవారం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పింఛన్ అమలు చేయాలని జిల్లా ఫోరం కన్వీనర్ శ్రీహరి డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన తపాలా కార్యాలయంలో పాత పింఛన్ విధానం అమలు కోరుతూ పోస్ట్ కార్డులు సీఎం చంద్రబాబుకు పంపారు.