SKLM: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ అంశంపై స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే ఆయన కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం నూతన కళాశాల మంజూరు చేసిందన్నారు