PPM: ఇచ్చాపురం ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన సంతపేట పంప్ హౌస్‌ను సోమవారం ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు ప్రారంభించారు. త్రాగునీటిని అందించడంతో స్థానిక ప్రజలు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.