AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు సా.4 గంటలకు 47వ CRDA అథారిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు నారాయణ, పయ్యావుల, CRDA కమిషనర్ హాజరుకానున్నారు. రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే రూ.49,154 కోట్లకు CRDA అథారిటీ అనుమతి ఇచ్చింది. మరో రూ.15,757 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.