WNP: వనపర్తి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నేరస్తునికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 25 వేల జరిమానా విధించడంలో, జిల్లాలో వివిధ కేసులో నేరస్తులకు శిక్ష పడడంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస చారీని వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ శాలువాతో సన్మానించి అభినందించారు.