చెపాక్ వేదికగా CSKతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఘనవిజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54), శ్రేయస్ అయ్యర్ (72) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో 19.4 ఓవర్లలో పంజాబ్ టార్గెట్ పూర్తి చేసింది. CSK బౌలర్లలో పతిరాన, ఖలీల్ అహ్మద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.