KRNL: కృష్ణగిరి మండలంలోని పెనుమాడ గ్రామ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో అటవీ శాఖ స్పందించారు. మంగళవారం ఫారెస్ట్ అధికారులు కాళిదాసు, రామచంద్రుడు గ్రామస్తులతో కలిసి పరిశీలనకు వెళ్లి, పొలాల్లో కనిపించిన చిరుత అనుమానిత పాదముద్రలను సేకరించారు. అవి నిజమైనవేనా అన్నది నిర్ధారించేందుకు నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.