SKLM: సింహాచలం దేవస్థానంలో జరిగిన విషాధకర ఘటనపై టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనలో మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఘటనపై విశాఖ జిల్లా కలెక్టర్, ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.