TG: సింహాచలం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పన్న ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించిన ఘటన ఆవేదన కలిగించిందని అన్నారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు.. ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.