GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ వాసవీ మాత ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా గోపూజ నిర్వహించారు. గో ప్రచారక్ సేవా సమితి ఆధ్వర్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేసి గ్రాసం అందించారు. హైదరాబాద్కు చెందిన కృష్ణవేణి పంపిన ‘గోమాత చీర’ను భవాని స్వీకరించారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.