CTR: వాయల్పాడు మండలం గండబోయినపల్లి గ్రామంలో నూతనంగా సీసీ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ సీసీ రోడ్డును మంగళవారం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డును ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.