KRNL: రాష్ట్ర ప్రభుత్వం నగరాల్లో, పట్టణాల్లో స్థానిక సంస్థల సేవలను పౌరులకు సులువుగా అందించేందుకు వీలుగా రూపొందించిన ‘పురమిత్ర’ యాప్ నగర ప్రజలు డౌన్లోడ్ చేసుకుని నగరపాలక సంస్థ సేవలను సులువుగా పొందాలని కర్నూల్ నగరపాలక అదనపు కమిషనర్ RGV కృష్ణ మంగళవారం కోరారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల్లో పరికరాలు, మరమ్మత్తులపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.