NLR: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి ముద్రా యోజన 10 ఏళ్లలో 520 మిలియన్ లోన్ల మైలురాయి దాటి రూ.33.65 లక్షల కోట్ల విలువైన లోన్లు మంజూరు చేయడం గర్వించదగిన విషయం అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ముద్రా యోజన భారత యువత, మహిళలు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు గొప్ప ఆర్థిక అవకాశం కల్పించిందన్నారు.