NLR: బుచ్చి పట్టణంలోని దుర్గా నగర్లో గడ్డివామి దగ్ధమైంది. సంపత్ మురళి అనే పాడి రైతు గేదెల కోసం పది ఎకరాల ఎండు గడ్డివామి తీసుకువచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గడ్డివామి తగలబడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం వాటిల్లందని పాడి రైతు సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు.