SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన వచ్చింది. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజాదర్బారును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.