VZM: నీటి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఆర్ఎస్డీటీలు, మండల సర్వేయర్లతో కలెక్టరేట్లో మంగళవారం రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపన్ను, పీజీఆర్ఎస్, రీసర్వే రెండవ దశ పై మండలాల వారీగా తహసీల్దార్లతో సమీక్షించారు.