గద్వాల: 2024-25 యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో రబీ యాక్షన్ ప్లాన్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని సూచించారు.