ELR: నూజివీడు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ కేసులలోని 14 మంది పాత నేరస్తులను మండల తహసీల్దార్ ఎదుట మంగళవారం చేశారు. ఈ సందర్భంగా నూజివీడు మండల తహసీల్దార్ బివి సుబ్బారావు మాట్లాడుతూ.. బైండోవర్ ఏడాది పాటు ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లక్ష రూపాయల జరిమానా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.