VZM: ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆధ్వర్యంలో గజపతినగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. నిరుపేదలకు గ్రామీణ ప్రాంతంలో ఇంటి స్థలంకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని తహసీల్దార్‌కి అందించారు.