HYD: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్ష విధించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 12 ఏళ్ల తర్వాత తీర్పు రావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ NIA అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.