ASF: ఆసిఫాబాద్ మండలంలోని MPDO కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రంని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అదనపు కలెక్టర్, మండల ప్రత్యేక అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను పరిశీలించారు. పథకం దరఖాస్తుకు ఈనెల 14 చివరి తేదీ అన్నారు. యువత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.