కృష్ణా: మచిలీపట్నం 23వ డివిజన్ ఇంఛార్జ్, టీడీపీ నాయకులు చింతా చిన్ని మాతృమూర్తి చింతా భాగ్యలక్ష్మి మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆమె పార్దివదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.