KRNL: కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు.