WGL: జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గోవిందరావుపేట మండలం రాంనగర్లో రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భానోత్ సమ్మక్కకు చెందిన రేకుల ఇల్లు ధ్వంసమైంది. రేకులు సమ్మక్కపై పడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగాయి, భారీ వృక్షాలు నేలకూలాయి.