వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీమంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా సిలిండర్ ధర రూ.50, పెట్రోల్, డీజిల్పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీని బీజేపీ ప్రభుత్వం పెంచిందని ఫైర్ అయ్యారు. ఇది బీజేపీ వాగ్దానం చేసిన అచ్చేదిన్కు సంకేతమా? లేక మేక్ ఇన్ ఇండియా గ్రేట్ అగైన్కు ప్రారంభమా? అని ప్రశ్నించారు.