ప్రకాశం: జిల్లాలో నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. పొన్నలూరులోని ముత్తరాజుపాలెం వద్ద ట్రాక్టర్ బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మార్కాపురంలో ఓ వ్యక్తి మద్యం సేవించి మృతి చెందాడు. ముండ్లమూరు మండలంలోని చంద్రగిరిలో ప్రమాదవశాత్తు కాలుజారటంతో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్దిపాడులో సీతారాంపురం గ్రామనికి చెందిన వృద్ధుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.