ELR: కైకలూరు పోలీస్ స్టేషన్లో మెడికల్ షాప్ యజమానులతో మంగళవారం రాత్రి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. మెడికల్ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు ఆవశ్యకత వివరించారు. అవాంఛనీయ సంఘటనలు, ఆకతాయిల సంచారాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఆపరేషన్ ఈగల్‌కు అందరూ సహకరించాలని సూచించారు.