అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ముకుంద గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ముకుందకు గుండెపోటు రావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.