ప్రకాశం: ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో కంభం పట్టణంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు సయ్యద్ జాకీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించి సమాజానికి మంచి జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.