NLR: 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తూ రాష్ట్ర క్యాబినెట్లో వర్గీకరణను ఆమోదించడంపై నెల్లూరు నగరంలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది మాదిగలు ప్రాణాలు కోల్పోయారన్నారు.