SRCL: శాంతిభద్రతల పరిరక్షణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే సూచించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.