HNK: ప్రతి ఏకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్ మోటార్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఉత్తంకుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అధికారులు పాల్గొన్నారు.