MBNR: గడచిన పది సంవత్సరాల కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్వరించిందని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.