KMM: ఎదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్గా మంగళవారం ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందలు తెలిపారు. అనంతరం ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన ఎదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.