BDK: బీసీ గురుకుల విద్యాలయాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి గానూ 6, 7, 8, 9వ తరగతి (ఇంగ్లిషు మీడియం)లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీ.సీ గురుకుల ఆర్సీఓ సి.హెచ్. రాంబాబు సోమవారం తెలిపారు. ఆసక్తిగల బాల-బాలికలు 150 రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.