SKLM: నందిగాం మండల కేంద్రంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి పేరాడ తిలక్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర అవతరణలో ఆయన సేవలను తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ్ మూర్తి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ రావు ఉన్నారు.