GNTR: కాకుమానుకు చెందిన కత్తి మహంకాళి అనే గర్భిణి సోమవారం రాత్రి బాపట్ల ఆస్పత్రికి వెళ్తుండగా, మార్గమధ్యలో అప్పాపురం వద్ద 108 అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ మురళి, పైలట్ యుగంధర్ ప్రసవం చేయగా, తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బందిని 108 అధికారులు అభినందించారు.