WGL: వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సత్య శారద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన వినతులు పరిశీలించి అధికారులు వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీ విజయలక్ష్మి, డీఆర్డీవో కౌసల్య దేవి, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.