NLG: జిల్లాలో సాగునీటి వనరుల నీటిమట్టం వేగంగా అడుగంటుతోంది. దీంతో వేసవిలో తాగు, సాగు నీటి కష్టాలు తప్పవా అంటూ అటు రైతులు ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కనీస నీటిమట్టం వరకు తోడుకోవాల్సి ఉండగా.. కుడి ఎడమ కాలువలకు ఎడా పెడా తోడేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.