SRD: పటాన్చెరు మండలం చిట్కూల్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 200 మందికి ఉచితంగా వైద్యాన్ని అందించినట్లు డాక్టర్లు తెలిపారు.