మేడ్చల్: జర్నలిస్టులకోసం త్వరలో మెగాహెల్త్ క్యాంపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని రాచకొండ కమిషనర్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. నేరేడ్మేట్ సీపీ కార్యాలయంలో శనివారం జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కార్యదర్శి వెంకటరామిరెడ్డి, మాజీస్టేట్ కౌన్సిల్ మెంబర్ భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో జర్నలిస్టుల బృందం సీపీ సుధీర్ బాబును కలిసి టీయూడబ్ల్యూజే డైరీ అందజేశారు.