కోనసీమ: అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామంలో శ్రీ లక్ష్మీగణపతి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సతీమణి చింతా అనురాధ పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.