AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు తిరుమల చేరుకుంది. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నెయ్యి కల్తీ ఘటనలో లోపాలపై విచారణ చేయనుంది. మొత్తం 45 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.