»No Bypoll At Wayanad Now Says Ec After Rahul Gandhi Disqualification
Bypoll : వయనాడ్ ఉప ఎన్నికపై ఈసీ క్లారిటీ..!
Bypoll : వయనాడ్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. వయనాడ్ రాహుల్ గాంధీ నియోజకవర్గమన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన పై అనర్హత వేటు వేయడంతో... ఆ నియోజకవర్గానికి మళ్లీ ఉప ఎన్నిక నిర్వహిస్తారని అందరూ భావించారు.
వయనాడ్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. వయనాడ్ రాహుల్ గాంధీ నియోజకవర్గమన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన పై అనర్హత వేటు వేయడంతో… ఆ నియోజకవర్గానికి మళ్లీ ఉప ఎన్నిక నిర్వహిస్తారని అందరూ భావించారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
వయనాడ్ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించాలని ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. వయనాడ్ ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉందని భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ అన్నారు.
ఎన్నికల చట్టం ప్రకారం ఏదైనా నియోజక వర్గం ఖాళీగా ఉంటే దానికి ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుందని చెప్పారు. వయనాడ్ స్థానం ఖాళీగా ఉన్నట్టు ఈ నెల 23న తాము గుర్తించామని పేర్కొన్నారు. ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉందన్నారు. సూరత్ కోర్టు కూడా పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్ గాంధీకి 30 రోజుల సమయం ఇచ్చిందని ఆయన వివరించారు. అప్పటి వరకు తాము వేచి చూస్తామన్నారు. కోర్టు తీర్పు వచ్చాక దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.