రానా దగ్గుబాటితో దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వర్మ తన డ్రీమ్ ప్రాజెక్టు ‘బ్రహ్మా రాక్షస’ మూవీ కథను రానాకు వినిపించగా.. కథ నచ్చి సినిమా చేసేందుకు ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండే ఈ సినిమాలో రానా టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.