కడప: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎటువంటి న్యాయం జరగడంలేదని పోరుమామిళ్లకు చెందిన మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఆరోపించారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పండిన పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకొని సంతోషంగా పండుగను జరుపుకునే వారన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు.