W.G: తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన బాలిక (17) పదో తరగతి చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 26న బాలిక బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రేమరాజు తెలిపారు.