సత్యసాయి: పెనుకొండ మండలం గుట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పూర్వపు విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయతగా పలకరించుకొని బాగోగులు గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం అప్పటి విద్యార్థి న్యాయవాదిగా స్థిరపడిన నాగరాజు అందరికీ విందును ఏర్పాటు చేశారు.