VSP: ఎలక్ట్రికల్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గోవింద హామి ఇచ్చారు. ఆదివారం మండలంలోని సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద జరిగిన ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సమస్యలని ఎంపీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.