Rahulకు ఆ అర్హత లేదు.. ఇప్పుడు అధికారికంగా రుజువైంది: వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
Vivek agnihotri:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul gandhi) ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek agnihotri) సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాల్లో రాహుల్ గాంధీకి (Rahul gandhi) అర్హత లేదు.. అదీ ఇప్పుడు అధికారికంగా రుజువైంది అని సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు.
Vivek agnihotri:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul gandhi) ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek agnihotri) సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాల్లో రాహుల్ గాంధీకి (Rahul gandhi) అర్హత లేదు.. అదీ ఇప్పుడు అధికారికంగా రుజువైంది అని సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు. ఇదివరకు ఇందిరాగాంధీపై కూడా అనర్హత వేటు పడిందని గుర్తుచేశారు. ఆమె నిజాయితీ గల నేత అయినందున తిరిగి నిలదొక్కుకున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి కనపడుతోందని వివేక్ అగ్నిహోత్రి (Vivek agnihotri) చెప్పారు. ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేనే లేదన్నారు. ఇందిరా గాంధీ కశ్మీర్‌ను కాపాడి ఉంటే.. కశ్మీర్ ఫైల్స్ మూవీ తీసే అవకాశం ఉండేది కాదని చెప్పారు. వివేక్.. కశ్మీర్ ఫైల్స్ మూవీలో అక్కడ బ్రాహ్మణుల పరిస్థితిని వివరించారు. ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. రాహుల్ గాంధీపై సంచలన ట్వీట్ చేశారు.
రెండేళ్ల కింద కోలార్ ఎన్నికల సభలో మోడీ ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలేనని రాహుల్ గాంధీ (Rahul gandhi) కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై కేసు నమోదైంది. సూరత్ కోర్టులో విచారణ జరిగి.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇవ్వడంతోపాటు.. శిక్షను నిలుపుదల చేసింది. ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకన్నా ఎక్కువ జైలుశిక్ష పడితే పదవీలో కొనసాగేందుకు అవకాశం లేదు. దీంతో లోక్ సభ సెక్రటరీ జనరల్ రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత బంగ్లా ఖాళీ చేయాలని కూడా నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సహా విపక్షాలు.. రాహుల్ (Rahul gandhi) అనర్హత వేటు గురించి పోరాటం చేస్తున్నాయి. తనకు తాను రాహుల్ గాంధీ.. డిస్ క్వాలీఫై అని ట్విట్టర్ బయో మార్చుకున్నారు.
Rahul Gandhi was always unqualified. It’s just that now it’s been made official.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 27, 2023